prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 3:07 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

దేశంలో ఎక్కడా లేని పెట్రోల్, డీజిల్ కొరత ఏపీలో ఎందుకు? సమస్యను గుర్తించి, చక్కదిద్దడంలో చంద్రబాబు సర్కార్ ఘోర విఫలం

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్27) దువ్వూరు  ఏపీలో 108 వాహనానికి డీజిల్ పోయలేని దుర్భర దుస్థితి.పరిస్థితి చెయ్యి దాటింది.విజనరీ చంద్రబాబుకు పెట్రోల్, డీజిల్ కష్టాలు ముందే కనిపించలేదా?పరిష్కారానికి చర్యలు నిల్.సీఎం సీరియస్ అంటూ లీకులు ఫుల్.తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం.పోరుగు రాష్ట్రాలైన తెలంగాణ,ర్ణాటక,తమిళనాడు, ఒడిస్సా తదితర రాష్ట్రాల్లో లేని పెట్రోల్,డీజిల్ కొరత,సంక్షోభం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో ఉందంటే సమస్యను గుర్తించి,చక్కదిద్దడంలో నారా చంద్రబాబు నాయుడు సర్కార్ ఘోరంగా విఫలమైందని దీనికి కూటమి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి,కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.దువ్వూరు మండలం, గుడిపాడు గ్రామంలోని దువ్వూరు సింగల్ విండో మాజీ ఛైర్మన్ తుమ్మల మస్తాన్ రెడ్డి స్వగృహంలో రెడ్యం విలేకరులతో మాట్లాడుతూ విజన్ 2020.విజన్ 2047 అంటారని కానీ ముందు చూపు (విజనరీ) లేని కారణంగా పెట్రోల్,డీజిల్ కొరతలు,కష్టాలు చంద్రబాబుకు ముందే కనిపించలేదా వారి ఆర్ధనాదాలు వినిపించలేదా? అని ఆయన ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల వారు ఆంధ్రప్రదేశ్ వెళ్తే బయటకు రావాలంటే పెట్రోల్,డీజిల్ దొరుకుతుందో లేదోఅన్న దుస్థితి నెలకొందని ఆయన మండిపడ్డారు.45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం,నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కానీ.పెట్రోల్,డీజిల్ సంక్షోభం రాకముందే అంచనా వేయలేని అపార అనుభవం,వీటి కోసం పెట్రోల్ బంకుల వద్ద నిలబడి కష్టాలు పడాల్సిన పరిస్థితి,దుస్థితి, ఎందుకొచ్చిందని? ఆయన సూటిగా ప్రశ్నించారు నిజంగా చంద్రబాబు విజనరీ అయితే ఒక్క ఏపీలోనే పెట్రోల్,డీజిల్ దుస్థితి,సమస్య వచ్చేదా?వ్యవస్థలు నిర్వీర్యమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారా అని ఆయన నిశితంగా విమర్శించారు. సమస్య జటిలమయ్యే వరకు కూటమి ప్రభుత్వం.ముఖ్యమంత్రి చంద్రబాబు నిద్రపోతున్నారా దీని పరిష్కారానికి లోకేష్ ఎక్కడ ఇలాంటి దద్దమ్మ ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదన్నారు.ఇలాంటి దుస్థితి వస్తుందని 3,4 రోజుల క్రితమే పరిస్థితి చేయిదాటి పోతుందని తెలిసినా ప్రభుత్వం దీనిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ఆలస్యంగా సమీక్షలు నిర్వహించినా ప్రయోజనం లేని దుస్థితి నెలకొందని,ఈరోజు ఇంకా ఎక్కువ పెట్రోల్ పంపులు మూసివేసారని ఆయన తెలిపారు. ఏపీలో 108 వాహనానికి డీజిల్ పోయలేని దుస్థితి నెలకొందని, ఇది చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధతకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన ఆందోళన వ్యక్తపరిచారు. హనుమాన్ జంక్షన్ రోడ్డులోని పెట్రోల్ బంక్ నిర్వాహకుడు 108 వాహనానికి డీజిల్ పోయకపోవడంతో సబ్ కలెక్టర్ స్వయంగా అక్కడికి వెళ్లాల్సి రావడం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ పరిస్థితి చేయి దాటిన అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని ఆయన ఆయన ఆవేదన చెందారు.డీజిల్,పెట్రోల్ కొరత అంటూ ప్రజల్లో భయాందోళన చెలరేగడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో అమ్మకాలు పెరిగాయని దీనివల్లే ఆయిల్ కొరత ఏర్పడిందని సంబంధిత శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలపడం”మసి పూసి మారేడు కాయ చేయడమే”నని ఆయన విమర్శించారు.ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై… కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటున్నామని డాంబికాలు పలుకుతోందని, దమ్ముంటే ఎంతమందిపై చర్యలు తీసుకుందో సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. దీనిపై చర్యలు లేకుంటే వైయస్సార్ సిపి చీఫ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్సార్సీపి ప్రజానీకం పక్షాన ఉద్యమిస్తుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. డీజిల్,పెట్రోల్ ధరల పరిష్కారానికి చంద్రబాబు సర్కార్ చర్యలు నిల్.సీఎం చంద్రబాబు దీనిపై సీరియస్ అంటూ లీకులు ఫుల్ అంటూ ఆయన వ్యంగ్యస్తాన్ని సంధించారు.ఇప్పటికై చిత్తశుద్ధితో కృషిచేసి డీజిల్,పెట్రోల్ ఇబ్బందులు తీర్చకుంటే ప్రజాక్షేత్రంలో చరిత్ర హీనులు కాక తప్పదని రెడ్యం తీవ్రంగా హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో వైయస్సార్ సిపి నేతలు తుమ్మల మస్తాన్ రెడ్డి,నంద్యాల శివ ప్రతాప్ రెడ్డి లు పాల్గొన్నారు