దేవాలయ భూమి అక్రమ విక్రయంపై చర్యలు తీసుకోవాలని పోరుమామిళ్ల, బి.కోడూరు ఎస్‌ఐలకు వినతిపత్రం*
వైఎస్సార్ కడప జిల్లా ఆగస్టు 3 ప్రజావాణి బి.కోడూరు మండలం మున్నెల్లి గ్రామంలోని శ్రీ మద్దిమాన్ గురప్పస్వామి దేవాలయ భూమిని అక్రమంగా వ్యక్తిగత పేరుకు మార్చుకుని విక్రయించారనే ఆరోపణలపై బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోరుమామిళ్ల, బి.కోడూరు పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మున్నెల్లి గ్రామానికి చెందిన ఓకిలి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, సర్వే నెం.39/Bలోని 2.23 ఎకరాల దేవాలయ భూమిని అక్రమంగా రికార్డుల్లో మార్చి, బ్యాంకుల్లో రుణాలు తీసుకుని అనంతరం రూ.22 లక్షలకు...