వైఎస్సార్ కడప జిల్లా ఆగస్టు 3 ప్రజావాణి బి.కోడూరు మండలం మున్నెల్లి గ్రామంలోని శ్రీ మద్దిమాన్ గురప్పస్వామి దేవాలయ భూమిని అక్రమంగా వ్యక్తిగత పేరుకు మార్చుకుని విక్రయించారనే ఆరోపణలపై బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోరుమామిళ్ల, బి.కోడూరు పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మున్నెల్లి గ్రామానికి చెందిన ఓకిలి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, సర్వే నెం.39/Bలోని 2.23 ఎకరాల దేవాలయ భూమిని అక్రమంగా రికార్డుల్లో మార్చి, బ్యాంకుల్లో రుణాలు తీసుకుని అనంతరం రూ.22 లక్షలకు విక్రయించినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి దేవాలయ భూమిని తిరిగి దేవస్థానానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాల ప్రతులు, ఈసీ, రెవెన్యూ రికార్డులు మరియు సంబంధిత పత్రాలను సమర్పించినట్లు పేర్కొన్నారు.ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో ఒకిలి శ్రీనివాస్ రెడ్డి (మున్నెల్లి విహెచ్ పి యాదాల రమేష్ (విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి),ఉండేల శ్రీనివాస్ రెడ్డి (బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి),ఫణిరావు స్వామి (ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సెక్రటరీ, వీహెచ్‌పీ అధ్యక్షుడు),నాగేంద్రబాబు (బీజేపీ కార్యకర్త),టంగుటూరి శంకరయ్య (వీహెచ్‌పీ) పాల్గొన్నారు.