దేవాలయ ఇనాం భూముల కౌలు బహిరంగ వేలం
రామగిరి మండలం సుందిల్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి,శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాలకు సంబంధించిన వ్యవసాయ భూములు వ్యవసాయం చేసుకోవడానికి కౌలుకు ఇవ్వనున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నోటీసులు విడుదల చేశారు.2026.05.28 వ తేదీన మండల కేంద్రంతో పాటు సుందిల్ల గ్రామంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన భూమి సర్వే నెంబర్ 167 లో 5.16 ఎకరాలు,సర్వే నెంబర్ 583లో 15 గుంటలు,సర్వే నెంబర్ 600 లో 31 గుంటలు,శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన సర్వే నెంబర్ 549 లో 2.23 ఎకరాలు, సర్వే నెంబర్ 603 లో 19 గుంటల విస్తీర్ణంలో గల భూమిని రెండు సంవత్సరముల కాల పరిమితితో దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు,గ్రామస్తుల ఆధ్వర్యంలో బహిరంగ వేలం ద్వారా కౌలుకు ఇచ్చుటకు నోటీసు విడుదల చేశారు.
ఆసక్తి ఉన్న గ్రామస్తులు, రైతులు భక్తులు అందరూ పాల్గొనవచ్చని దేవాదాయ శాఖ ఈవో రాజ్ కుమార్, ఆలయ చైర్మెన్ కోర కొప్పుల సత్యనారాయణ గౌడ్ ఒక ప్రకటనలో తెలుపడం జరిగింది.
