prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 3:17 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

దేవాలయాలలో రాజకీయ అండతో రెచ్చిపోతున్న ఎన్ఎంఆర్ ఉద్యోగులు పర్మినెంట్ ఉద్యోగులు మౌనం

ప్రజావాణిన్యూస్(ఏప్రిల్12)పెనుగంచిప్రోలు,తిరుమలగిరి,వేదాద్రి దేవాలయాల్లో మరో సంచలన విషయాలు ప్రశ్నించే గొంతుకు దేవాలయ పరిపాలనలో తీవ్ర అవకతకులు జరుగుతున్నాయని బహిరంగ విమర్శలకు దారితీస్తున్నాయి.రాజకీయ నాయకులు అండదండలతో కొంతమంది ఎన్ ఎంఆర్ ఉద్యోగులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యవస్థను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తాత్కాలిక హోదాలో ఉన్న ఈ ఉద్యోగులు పర్మినెంట్ సిబ్బందిని కూడా ప్రభావితం చేస్తూ తమ నిర్ణయాలు అమలు చేయిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.పర్మినెంట్ ఉద్యోగులు ఎందుకు మౌనం వహిస్తున్నారు.వారు కూడా వ్యవహారంలో భాగస్వామ్యలేనా అని సందేహం ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.అవినీతి ఆరోపణలు వ్యవస్థపై మచ్చ.దేవాలయాల్లో సేవలు టికెట్లు ఇతర వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయి అనే ఆరోపణలు ఎన్ఎంఆర్ రాజకీయ అండదండలతో నియమ నిబంధనలు పక్కనపెట్టి వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.దేవాలయాలు భక్తుల విశ్వాసానికి ప్రతీకలు.కావలసిన చోట అవినీతి ఒత్తిళ్లు పెరగటం భక్తులకు తీవ్రంగా కలిసి వేస్తుంది.దేవుడు ఆలయాలు కూడా రాజకీయాలకు వేదికగా మారిందా.అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారుల నిర్లక్ష్యం.ఈ వ్యవహారంపై సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవడం మరింత అనుమానాలకు దారితీస్తుంది. బహిరంగంగా విమర్శలు వెలివెత్తుతున్నా కఠిన చర్యలు తీసుకోవడం వెనుక కారణాలు ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.తక్షిణ చర్యలపై డిమాండ్.ఎన్ఎంఆర్ ఉద్యోగుల అక్రమ జోక్యాలపై దర్యాప్తు జరపాలి.రాజకీయ అండతో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలి,పర్మినెంట్ సిబ్బంది బాధ్యతను స్పష్టంగా అమలు చేయాలి.ప్రస్తుతం కొనసాగుతున్న ఈ పరిస్థితులు దేవాలయాల పవిత్రతను దెబ్బతీస్తున్నాయని వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే భక్తులు,ప్రజా ఆందోళన ఉదృతం కావచ్చని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.జగ్గయ్యపేట నియోజకవర్గంలో కొంతమంది పర్మినెంట్ అవినీతి అధికారులు ఈ ఎన్ ఎమ్ ఆర్ ఉద్యోగులకు అడుగులకు మడుగులు వత్తు తున్నారు.కారణం వారికి మరల ఎక్కడ అపవాదులు ట్రాన్స్ఫర్లు వస్తాయో నని ఒకపక్క భయము.పెనుగంచిప్రోలు,తిరుమలగిరి,వేదాద్రి దేవాలయాల్లో మరో సంచలన విషయాలు ప్రశ్నించే గొంతుకు దినపత్రికలో అవినీతి. ఆరోపణలు,అసాంఘిక,అనైతిక,ఆరోపణలు ఉన్న అధికారులను,సిబ్బందిని మరలా ఈ దేవాలయాలకు రావడానికి అనుమతి ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధిలు ఎవరు.సంశేష వార్త కోసం ఎదురు చూడండి.