బెజ్జంకి,ఏప్రిల్ 17( ప్రజావాణి)
సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని దేవక్కపల్లి గ్రామంలో గత నెల నుంచి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి.ఈ పోటీలలో ప్రాంతీయ జట్లు భారీగా పాల్గొని క్రీడా ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి.ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన అన్నారం జట్టు మొదటి బహుమతిని గెలుచుకుని రూ.20,000 నగదు బహుమతి అందుకుంది. రెండో స్థానంలో నిలిచిన దేవక్కపల్లి జట్టుకు రూ.10,000, మూడో స్థానంలో నిలిచిన రామకృష్ణ కాలనీ జట్టుకు రూ.5,000 నగదు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ పోటీలకు స్థానిక ప్రముఖులు మరియు దాతలు సహకరించారు. కరివేద మహిపాల్ రెడ్డి, ఒంటెల సంపత్ రెడ్డి, రావుల రాజశేఖర్ రెడ్డి తలా రూ.10,000 చొప్పున విరాళాలు అందించగా, కొమ్ము కొమురయ్య రూ.5,000, డా. చల్లూరి విజయ్ కుమార్ కూడా బహుమతులు అందించారు.ఈ
కార్యక్రమంలో జంగిడి సంజీవ రెడ్డి, గ్రామ యువకులు పాల్గొని పోటీలను విజయవంతం చేశారు.