prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 11:05 am Digital Edition : RAJASHEKARREDDY

దేవక్కపల్లిలో బీజేపీ బూత్ కమిటీ సమావేశం – తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలి ” ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకుల పిలుపు”

బెజ్జంకి, జూలై 20 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో ఆదివారం బీజేపీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేపీ మండల అధ్యక్షుడు రాజు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కే. మహిపాల్ రెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా స్టేట్ ఆఫీస్ బెంగళూరు నుండి శ్రీకాంత్, జిల్లా బాధ్యులు ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాల సమాచారం చేరేలా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో చంద్రరెడ్డి, రాజిరెడ్డి, బల్‌రెడ్డి లక్ష్మణ్, కనుకయ్య, రాజయ్య, సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు.