కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే06) ఖాజపేట మండలం దుంపలగట్టు హరిజనవాడలో.ఫాతిమా మాత దేవాలయం (చర్చి)ని ప్రారంభించిన కడప బిషప్ డా||పాల్ ప్రకాష్ సగినాల.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి,జడ్పీ చైర్మన్ రామ గోవిందరెడ్డి,రెడ్యం.పాల్గొన్న వారందరికీ రెడ్యం సోదరుల కృతజ్ఞతలు.దుంపలగట్టు గ్రామపంచాయతీలోని దుంపలగట్టు హరిజనవాడలోని ఫాతిమా మాత దేవాలయం (చర్చి)ని బుధవారం ఉదయం కడప బిషప్ డా||పాల్ ప్రకాష్ సగినాల వారి దివ్య ఆశీస్సులతో.పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఫాదర్స్ తో.వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి,కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డిలు చర్చికి సంబంధించి 6 మంది పెద్దమనుషులతో,గ్రామస్తులతో కలిసి ఘనంగా ప్రారంభించారు.
ముందుగా కడప ఎంపీ వై.ఎస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు మాజీ శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి,జడ్పీ చైర్మన్ ముత్యాల రామ గోవిందరెడ్డి, వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి,కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని.ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చి పెద్ద మనుషులు వీరిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైయస్సార్ సిపి నేతలు పాల్గొనగా వారందరినీ సన్మానించారు చర్చి ప్రారంభ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు.చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేశారు.చర్చిని ప్రారంభించిన కడప బిషప్ డా||పాల్ ప్రకాష్ సగినాల వారికి, ఫాదర్స్ కు,ముఖ్యంగా ఎంపీ వై.ఎస్ అవినాష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి,జెడ్పి చైర్మన్ ముత్యాల రామ గోవిందరెడ్డి,రెడ్యంతో పాటు చర్చి పెద్దలు కొండూరు పాల కొండయ్య,పసల జయన్న,చాట్ల రాజశేఖర్,దుంపలగట్టు నారాయణ,చాట్ల ఓబయ్య, దుంపలగట్టు చిన్నయ్య లకు చర్చి ప్రారంభోత్సవాన్ని కలసికట్టుగా జరుపుకున్న గ్రామస్తులు అందరికీ రెడ్యం సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. చర్చి ప్రారంభోత్సవం ఘనంగా జరగడం పట్ల హర్షం వ్యక్తపరిచారు. ముందుగా బిషప్ డా||పాల్ ప్రకాష్ సగినాల వారిని రెడ్యం సోదరులు సన్మానించగా. రెడ్యంను బిషప్ సన్మానించి పరస్పరం గౌరవించుకున్నారు.