బెజ్జంకి, మే 29 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులపై అక్రమ ఇసుక రవాణా ఆరోపణల నేపథ్యంలో బెజ్జంకి పోలీసులు తహసీల్దార్ కల్యాణపు శ్రీకాంత్ ఎదుట పలువురు బైండోవర్ చేశారు.దాచారం గ్రామ శివారులో అక్రమంగా ఇసుక నిల్వలు చేసిన ఘటనలో మొత్తం 11 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.ఇందులో ఆరుగురిపై ప్రస్తుతం బైండోవర్ చర్యలు చేపట్టినట్లు,మిగతా ఐదుగురిపై కూడా త్వరలోనే బైండోవర్ చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కల్యాణపు శ్రీకాంత్ వెల్లడించారు.పట్టుబడ్డ వారిలో గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్, వేణుగోపాల్, చంద్రశేఖర్, రాజు, శ్రీకాంత్ తదితరులు ఉన్నట్లు సమాచారం. గ్రామ పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక తరలింపును అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే బైండోవర్ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.