దాచారం గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

  బెజ్జంకి, ఆగస్టు 4 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని దాచారం గ్రామంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలను సర్పంచ్, ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, పుట్టిన శిశువుకు తొలి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలే ఇవ్వాల్సిన అవసరం, తల్లిపాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించారు.అనంతరం ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి, 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకు బాలామృతం పంపిణీ చేశారు....