prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 5:09 pm Digital Edition : RAJASHEKARREDDY

దాచారం గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

 

బెజ్జంకి, ఆగస్టు 4 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని దాచారం గ్రామంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలను సర్పంచ్, ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, పుట్టిన శిశువుకు తొలి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలే ఇవ్వాల్సిన అవసరం, తల్లిపాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించారు.అనంతరం ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి, 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకు బాలామృతం పంపిణీ చేశారు. అలాగే ప్రీ-స్కూల్ చిన్నారులకు యూనిఫాంలను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బైర మానస-రాజేందర్ ఉపసర్పంచ్ దిటి బాలనర్సు,అంగన్వాడీ సూపర్వైజర్ నాగరాణి, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, గర్భిణీలు, బాలింతలు, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.