దళిత యువకుల మరణాలపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలి: మందకృష్ణ మాదిగ

ప్రజావాణి న్యూస్ (మార్చి 11)కలసపాడు మండలం ముద్దంవారిపల్లె కు గ్రామానికి చెందిన ఇమాన్యుల్, కాశి నాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ అనే దళిత యువకులు అనుమానస్పద రీతిలో ఇటీవల మృతి చెందారు. బుధవారం వారి కుటుంబ సభ్యులను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరుసగా దళిత యువకులను టార్గెట్ చేస్తూ హత మారిస్తే ఊరుకోమని హెచ్చరించారు. దళిత యువకుడు దిలీప్ మృతి ఆత్మహత్య కాదని ప్రేమ వ్యవహార హత్య అన్నారు. ఈ...