prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 4:23 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

దళిత యువకుల మరణాలపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలి: మందకృష్ణ మాదిగ

ప్రజావాణి న్యూస్ (మార్చి 11)కలసపాడు మండలం ముద్దంవారిపల్లె కు గ్రామానికి చెందిన ఇమాన్యుల్, కాశి నాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ అనే దళిత యువకులు అనుమానస్పద రీతిలో ఇటీవల మృతి చెందారు. బుధవారం వారి కుటుంబ సభ్యులను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరుసగా దళిత యువకులను టార్గెట్ చేస్తూ హత మారిస్తే ఊరుకోమని హెచ్చరించారు. దళిత యువకుడు దిలీప్ మృతి ఆత్మహత్య కాదని ప్రేమ వ్యవహార హత్య అన్నారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు నీరు కార్చకుండా సమగ్ర విచారణ చేపట్టి నిందితులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిలీప్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత పిరికివాడు కాదని ఆయన అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వయంగా ఆ యువకుడే తన తల్లిని చూసుకోవాలని తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని తనపై కొందరు దుండగులు దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడన్నారు. ఇవన్నీ క్లుప్తంగా ఉన్నాయని వాటిపై సమగ్ర విచారణ చేస్తే నిజమైన నిందితులు దొరుకుతారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించి ప్రచారాలు చేశారని ఆయన అన్నారు. తెలుగు నేలపై హత్యలు ఆత్మహత్యలుగా, ప్రమాదవశాత్తు జరిగే మరణాలుగా మారతున్నాయంటే అవి ఒక్క కడప జిల్లాలోనేని ఆయన ఆరోపించారు. దిలీప్ మృతి కూడా కేవలం సెల్ టవర్ ఆధారంగా కాకుండా మరో కోణంలో విచారించాలని పోలీసులను కోరారు