దళిత మహిళపై కుల వివక్ష దాడిని ఖండిస్తూ బెజ్జంకిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నిరసన
బెజ్జంకి,జూన్ 27 (ప్రజావాణి) ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా దళిత మహిళపై జరిగినట్లు ఆరోపిస్తున్న కుల వివక్ష దాడిని ఖండిస్తూ శనివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వడ్లూరి పరశురాములు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బోనగిరి రూపేష్, మాల మహానాడు మండల అధ్యక్షుడు సంగెం రూపేష్ మాట్లాడుతూ, ఆలయంలోకి...