prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 1:52 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

దళిత బహుజన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెట్టు బాల్ రెడ్డి మాజీ కౌన్సిలర్ 

ఘాట్ కేసర్ ఏప్రిల్ 14( ప్రజావాణి).    మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ 8వ వార్డు రాజీవ్ గృహకల్పలో మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాసు మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోచారం మున్సిపల్ 9 వ వార్డు మాజీ కౌన్సిలర్ సింగపూర్ టౌన్షిప్ శ్రీ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మెట్టు బాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తని పేద బడుగు బలహీనులకు రాజ్యాంగపరంగా అనేక చట్టాలు ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్ర హక్కులను కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఇటువంటి మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియచెప్పేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ జీకే మాల సంక్షేమ సంఘం కమిటీ సభ్యులతో పాటు వివిధ సంఘాల నాయకులు రాజకీయ నాయకులు యువకులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.