దమ్మాయిగూడెం గ్రామంలో ఈత చెట్లు కాలిపోయిన ఘటనపై రైతు వడ్డెబోయిన నరసయ్య వివరణ..
తిరుమలాయపాలెం, ప్రజావాణి: తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో ఇటీవల ఈత చెట్లు కాలిపోయిన ఘటనకు సంబంధించి గ్రామానికి చెందిన రైతు వడ్డెబోయిన నరసయ్య స్పందిస్తూ పూర్తి వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో ఉపాధి హామీ కూలీలు గానీ, ఉపాధి హామీ అధికారులుగానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వివరణ ఇస్తున్నట్లు తెలిపారు.రైతు వడ్డెబోయిన నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం తన సొంత వ్యవసాయ భూమిలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తానే స్వయంగా...