థాయ్ బజార్ అక్రమ పైసా వసూల్
సర్దార్ నగర్ మార్కెట్‌లో అక్రమ తాయ్ బజార్ వసూళ్లు
– అనుమతి ఒకచోట… వసూలు మరో చోటా
– వ్యవసాయ మార్కెట్‌కు వచ్చే
బండ్ల నుంచి వసూళ్లు చేయొద్దు
మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి
షాబాద్ //మే 24
(ప్రజావాణి)
షాబాద్ మండలంలోని సర్దార్ నగర్ మార్కెట్‌లో అక్రమ తాయ్ బజార్ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారికంగా అనుమతి ఉన్న ప్రాంతాన్ని పక్కనబెట్టి, మార్కెట్‌కు వచ్చే రైతులు, వ్యాపారుల బండ్ల వద్ద వేరే చోట వసూళ్లు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకంగా వ్యవసాయ మార్కెట్‌కు కూరగాయలు, ధాన్యం తీసుకొచ్చే రైతుల వాహనాల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై స్పందించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌కు వచ్చే బండ్ల నుంచి ఎలాంటి తాయ్ బజార్ వసూళ్లు చేయరాదని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమ వసూళ్లపై అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

