prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 6:51 am Digital Edition : PRAJA VANI

త్వరలో ముగినున్న పందిళ్ళపల్లి మత్స్య సొసైటీ పాలకవర్గం గడువు

చివరి సర్వసభ్య సమావేశం కు రంగం సిద్ధం…

*సొసైటీ పరిధిలో నూతన సభ్యత్వాలు కోసం.. తీర్మానం కోసం ఆశావాహుల ఎదురుచూపులు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి మత్స్య సొసైటీ పాలకవర్గం గడువు ఆగస్టు 26 తో ముగినుండటంతో చివరి సర్వసభ్య సమావేశం నేడు మంగళవారం స్థానిక పందిళ్ళపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించడానికి అధ్యక్ష కార్యదర్శులు నిర్ణయించి సంఘం పరిధిలోని పందిళ్ళపల్లి బొప్పారం గాంధీనగర్ కాలనీ అనంతసాగర్ గ్రామాలకు చెందిన మత్స్యకారులకు సమాచారం అందించారు. కాగా గత కొన్ని సంవత్సరాల క్రితం నూతన మత్స్యకారుల విధానంలో గత ప్రభుత్వం నిబంధనలు మార్చిన నేపథ్యంలో గత పది సంవత్సరాల నుండి నూతన సభ్యత్వాలు పొందేందుకు ఆశావాహులైన మత్స్యకారులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో చివరి సర్వసభ్య సమావేశం ప్రాధాన్యతగా మారింది. దీంతో ఇప్పటికే సంఘం పరిధిలోని ఆశావాహులు ఆధార్ కార్డులు ఇతర ధ్రువీకరణ పత్రాలు అందించినట్లు తెలిసింది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అర్హులైన మత్స్యకారులకు అవకాశం కల్పించాలని పలువురు మత్స్యకారులు కోరుతున్నారు. వచ్చే ఆగస్టు 26 కి పాలకవర్గం గడువు తీరిపోవడంతో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి నూతన మత్స్యకారులకు విస్తీర్ణం ప్రకారం సర్వసభ్య సమావేశం చేసే తీర్మానంను రాష్ట్ర జిల్లా మత్స్యశాఖ అధికారులు పరిగణలోకి తీసుకొని నూతన సభ్యుల నమోదుకు అవకాశం కల్పించాలని సంఘం అధ్యక్షుడు కార్యదర్శి ఎస్కే రహీం సై జానీ తూటిపల్లి వీరభద్రం సింగారపు వీరభద్రం సింగారపు వీరమల్లు లింగం నాగేశ్వరరావు తదితరులు కోరుతున్నారు.