తొలి ఏకాదశి మహిమ… శ్రీహరి యోగనిద్రకు నాంది భక్తి, ఉపవాసం, జాగరణతో పుణ్యఫలాలు ప్రసాదించే పవిత్ర పర్వదినం

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, గొల్లపల్లి జులై 24 (ప్రజావాణి): హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన వ్రతాల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశికి విశేష ప్రాధాన్యం ఉంది.దీనినే తొలి ఏకాదశి,శయన ఏకాదశి,హరివాసరం,ప్రథమ ఏకాదశి అని పిలుస్తారు.ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.అందువల్ల ఈ ఏకాదశిని అత్యంత పవిత్రమైన రోజుగా భక్తులు భావించి ఉపవాసం,పూజలు,జాగరణతో ఆచరిస్తారు. ఏకాదశి అంటే ఏమిటి....? "ఏకాదశి" అంటే పదకొండు.మనిషిలోని ఐదు జ్ఞానేంద్రియాలు,ఐదు కర్మేంద్రియాలు,వాటిని నియంత్రించే మనస్సు కలిపి పదకొండు.ఈ పదకొండు ఇంద్రియాలను నియంత్రించి భగవంతుని ధ్యానంలో లీనమయ్యే...