తొలిరోజు 25-04-26న విజయవంతమైన ఫ్యాప్టో నిరాహార దీక్ష

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) విజయవాడ ఫ్యాప్టో మలిదశ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 25వ తేది విజయవాడ ధర్నా చౌక్ నందు జరిగిన నిరాహార దీక్ష విజయవంతమైనదని ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్,సెక్రటరీ జనరల్ ఎస్. చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేశారు.12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ ను అమలు చేయాలని, స్థానిక సంస్థలలో కారుణ్య నియామకాలను చేపట్టాలని, హైస్కూల్ ప్లస్ లను బలోపేతం...