prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 9:44 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

తొలిరోజు 25-04-26న విజయవంతమైన ఫ్యాప్టో నిరాహార దీక్ష

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) విజయవాడ ఫ్యాప్టో మలిదశ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 25వ తేది విజయవాడ ధర్నా చౌక్ నందు జరిగిన నిరాహార దీక్ష విజయవంతమైనదని ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్,సెక్రటరీ జనరల్ ఎస్. చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేశారు.12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ ను అమలు చేయాలని, స్థానిక సంస్థలలో కారుణ్య నియామకాలను చేపట్టాలని, హైస్కూల్ ప్లస్ లను బలోపేతం చేయాలని,పెండింగ్ డి. ఏ లను విడుదల చేయాలని,సరెండర్ లీవు బకాయిలను చెల్లించాలని ప్రతిపాదించిన 17 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.ఈ నిరాహార దీక్షకు ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు బొర్రా గోపి మూర్తి గారు, ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు నాయుడు గారు సంఘీభావం ప్రకటించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో రాష్ట్ర కోచైర్మన్ లు కె.నరహరి,సిహెచ్, రమేష్,కాకి ప్రకాష్ రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ లు ఎన్.వెంకటేశ్వర్లు,కే బసవలింగారావు,జి.శ్రీనివాస రావు, కోశాధికారి చింతల సుబ్బారావు,కార్యవర్గ సభ్యులు సిహెచ్ మంజుల,జి. హృదయ రాజు,ఎన్వి రమణయ్య,ఎం.రాజేంద్ర బాబు,ఏ రామారావు,ఎంజి మెహది తదితరులు పాల్గొన్నారు.ఈరోజు నిరాహార దీక్షలో అనంతపురం,శ్రీకాకుళం,విశాఖపట్నం,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ,ఎన్టీఆర్,బాపట్ల, నెల్లూరు,నంద్యాల,పశ్చిమగోదావరి నుండి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.పిఆర్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.కృష్ణయ్య,ఎం. ప్రసాద్ రెడ్డి గారు నిరాహారదీక్షకు సంఘీభావం ప్రకటించారు