తిరుపతి జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్13)చంద్రగిరి మండలం తొండవాడ గ్రామపంచాయతీలో కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను స్థానిక నాయకులు కబ్జా చేశారు.ఆక్రమాలపై ఆందోళన చేసేందుకు ఓవర్గం నాయకుడు సమాయత్తం అవుతున్నారు.దీంతో తొండవాడ గ్రామంలో ప్రకంపనలు మొదలయ్యే అవకాశం ఉంది వివరాలు ఇలా ఉన్నాయి.తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామపంచాయతీలో పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను రాజకీయ నాయకుల అండదండలతో పలువురు నాయకులు స్థానికులు కబ్జా చేశారు.దీంతో కోట్ల రూపాయల భూములను కబ్జా చేసినట్లు తెలుస్తోంది. తొండవాడ గ్రామానికి చెందిన ఓ యువ నాయకుడు దీనిపై ఆందోళన చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. వెంటనే భూ ఆక్రములను సర్వే చేసి ఆక్రమం తొలగించాలని డిమాండ్తో స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఆ నాయకుడు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.తొండవాడ గ్రామంలో భూ బకాసురుల ఆగడాలకు అదుపు లేకుండా పోతున్న పరిస్థితి నెలకొంది. గత వైఎస్సార్సీపీ పార్టీ అధికార బలంతో,అండదండలతో కొందరు వ్యక్తులు అధికారులకు, స్థానిక నాయకులకు ముడుపులు అందించి కాలువ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి.హీరా కాలేజ్ నిర్వాహకులు కాలువ భూములను ఆక్రమించి శాశ్వత కట్టడాలు నిర్మించగా,కేశవ రెడ్డి స్కూల్ యాజమాన్యం కూడా అదే భూములపై భవన నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.ఇక స్థానిక నాయకుడి బంధువులు కూడా ఇదే తరహాలో ముందుకు సాగి,పెట్రోల్ బంక్,పెయింట్ షాప్,సిమెంట్ దుకాణాలు ప్రారంభించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.మరికొందరు కాలువ భూములపై ఫామ్ హౌస్‌లు నిర్మించుకుని సుమారు మూడు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.ఇంకొంతమంది వెంచర్లు ఏర్పాటు చేసి వ్యవసాయ భూముల్లో కలుపుకుంటుండగా, మరికొందరు కొత్తగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు.
ఈ అంశంపై ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అదే సమయంలో,చిన్న మరియు మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు పశువుల పెంపకానికి వంక పరంబోకు భూముల్లో చిన్న దొడ్లు ఏర్పాటు చేసుకుంటే,అధికారులు వారిపై తమ ప్రతాపం చూపి చర్యలు తీసుకుని బలవంతంగా తొలగించిన ఘటనలు చోటుచేసుకున్నాయి.కోట్ల రూపాయల విలువ చేసే కాలువ భూములు ఈ విధంగా అన్యాక్రాంతానికి గురవుతున్నా అధికారులు, స్థానిక నాయకులు మౌనంగా ఉండడం పట్ల గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాలువ పరంబోకు భూములను ఆక్రమించుకున్న నాయకులపై అధికారులు ఉదాసీనత వ్యవహరిస్తున్నారు.మామూళ్ల మత్తులో రెవిన్యూ అధికారులు తులతూవుతున్నారు.నిద్రావస్థలో రెవెన్యూ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న అధికారులకు తెలిసిన అధికారులు పట్టించుకోవడం లేదు.దీనిపై ఉద్యమం చేపట్టేందుకు చెందిన యువ నాయకుడు తన కార్యచరణను రూపొందించారు.దీనిపై స్థానిక తహసిల్దార్ కు ఇదివరకే వినతి పత్రాన్ని సమర్పించారు. ఆక్రమంమణలు తొలగించాలని తాసిల్దార్ ను డిమాండ్ చేశారు. అయితే తాసిల్దారులు ఇటువంటి మార్పు రాకుండా పోవడంతో ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. ఆందోళన చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని వేచి చూడాలి. తొండవాడ పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను పలువురు ఆక్రమించుకొని ఉన్నారు. అసలు ఆ నాయకుడు ఆందోళన చేపడతారా.కబ్జాదారులతో కుమ్మక్క అవుతారా అన్న విషయం తెలియ రాలేదు.ఆందోళన చేపడితే తొండవాడలో ప్రకంపనలు మొదలయ్యే అవకాశం ఉంది. ఆక్రమాలపై ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరికొంత భూములపై కూడా న్యాయస్థానానికి వెళ్లేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.ఏది ఏమవుతుందో అసలు తొండవాడలో ఏం జరుగుతుందో కొంత సమయం వేచి చూడాలి మరి.