
తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్17) తొండవాడ గ్రామంలోని శ్రీమతి బోయరెడ్డి గారి లీలావతమ్మ మెమోరియల్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం అగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఉపాధ్యాయులు సూర్య నారాయణ గారు, వారి ఉపాధ్యాయ బృందం మరియు తొండవాడ గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ వేడుకలకు పాఠశాల దాతలు బోయరెడ్డి గారి మంజుల్లమ్మ, మాజీ సింగిల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎస్. ఉమాపతి రెడ్డి, పులికంటి మోహన్ రెడ్డి, జనసేన సీనియర్ నాయకులు తపసి మురళి రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు గోపాల్ యాదవ్ గారు, చెంచులక్ష్మి గారు తదితర గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై, అనంతరం పాఠశాల విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను నిర్వాహకులు సన్మానించారు.మొత్తానికి, ఈ వార్షికోత్సవం గ్రామ యువత సమక్షంలో ఘనంగా నిర్వహించబడింది.