తెల్లాపూర్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

తెల్లాపూర్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు సంక్షేమ పాలనకు వైఎస్సార్ ఆదర్శం : కాంగ్రెస్ నాయకులు   తెల్లాపూర్, జూలై 8(ప్రజావాణి): పటాన్‌చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ డివిజన్‌లో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్...