prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 7:14 am Digital Edition : SHEKARREDDY PATANCHERUV

తెలంగాణ రాష్ట్ర భవన కార్మికుల సంఘానికి గౌరవాధ్యక్షుడుగా మాద్రి పృథ్వీరాజ్ ఎన్నిక

•తెలంగాణ రాష్ట్ర భవన కార్మికుల సంఘానికి గౌరవాధ్యక్షుడుగా మాద్రి పృథ్వీరాజ్ ఎన్నిక

*భవన కార్మికుల సంక్షేమానికి మాద్రి పృథ్వీరాజ్ భరోసా

*కొత్త వేతన రేట్ల బోర్డు ఆవిష్కరణ – సభ్యులందరికీ ఇన్సూరెన్స్ హామీ

పటాన్చెరు, జూలై 29 (ప్రజావాణి):పటాన్చెరువులో తెలంగాణ రాష్ట్ర భవన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో పెయింటర్లు, మేస్త్రీలు, కూలీలు తదితర భవన నిర్మాణ కార్మికులు ఏకమై సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాద్రి పృథ్వీరాజ్‌ను సంఘ గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కార్మికుల సంక్షేమానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమానికి గూడెం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం భవన నిర్మాణ కార్మికుల కొత్త వేతన రేట్ల బోర్డును ఆవిష్కరించారు. కార్మికుల శ్రమకు తగిన గౌరవం, న్యాయమైన వేతనం అందేలా కొత్త వేతన రేట్ల అమలు అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో భవన నిర్మాణ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. కార్మికుల సంక్షేమమే తన లక్ష్యమని, సంఘంలోని ప్రతి సభ్యుడికి తన సొంత ఖర్చులతో ప్రమాద బీమా (ఇన్సూరెన్స్) సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కార్మికుల సమస్యల పరిష్కారానికి సంఘంతో కలిసి పనిచేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్, రాము, గుండమోల్ల రాజు, ఎంఫీఆర్ యువసేన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర భవన కార్మికుల సంఘం నాయకులు, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.