తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వేముల మహేష్ గౌడ్
ఘట్‌కేసర్, జూన్ 2 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘట్‌కేసర్ మండల పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మొదటగా ఎంఎంసీ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని 6వ డివిజన్ అంబేద్కర్ కూడలి వద్ద నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన, అనంతరం 7వ డివిజన్ ఎదులాబాద్ పరిధిలోని ఘనపురం పవర్ గ్రిడ్ వద్ద ఘనపురం...