prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 8:11 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వేముల మహేష్ గౌడ్

ఘట్‌కేసర్, జూన్ 2 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘట్‌కేసర్ మండల పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

మొదటగా ఎంఎంసీ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని 6వ డివిజన్ అంబేద్కర్ కూడలి వద్ద నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన, అనంతరం 7వ డివిజన్ ఎదులాబాద్ పరిధిలోని ఘనపురం పవర్ గ్రిడ్ వద్ద ఘనపురం గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వేముల రాజు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నానావత్ రూప్‌సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఉపసర్పంచులు వేముల సత్తయ్య గౌడ్, వేముల పరమేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు వేముల శంకర్ గౌడ్, నానావత్ సురేష్ నాయక్, జిల్లా ఎన్‌ఎస్‌యూఐ కార్యదర్శి నానావత్ శివాజీ నాయక్, నాయకులు గడ్డం శ్రీనివాస్, వేముల వికాస్ గౌడ్, వేముల గణేష్ గౌడ్, కిష్ శివ గౌడ్, యువ నాయకుడు వేముల మణిశరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.