prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 12:28 pm Digital Edition : PRAJA VANI

తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహమ్మద్ ఆబేద్ పాల్గొన్నారు<br>

తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహమ్మద్ ఆబేద్ పాల్గొన్నారు

మన సమగ్ర ప్రజావాణి జూన్ 22
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

ఆందోల్ నియోజకవర్గం జోగిపేటలోని ముదిరాజ్ భవన్‌లో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్  ఆధ్వర్యంలో ఐడీ కార్డులు మరియు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహమ్మద్ ఆబేద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఫెడరేషన్ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. జర్నలిస్టులకు గుర్తింపు కల్పించే ఐడీ కార్డులు, ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు, జర్నలిస్టులు మరియు ఇతర సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం కోసం అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.