తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా దుడ్డేల సమ్మయ్య ఎన్నిక
మన ప్రజావాణి ప్రతినిధి(చిగురుమామిడి): తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన ప్రజానాట్యమండలి కళాకారుడు దుడ్డేల సమ్మయ్య ఎన్నికయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజానాట్యమండలి 26వ రాష్ట్ర మహాసభల్లో ఆయనను రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నారు.ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమ్మయ్య, కళారంగంలో మరియు ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ గుర్తింపు పొందారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, తనకు సహకరించిన...