prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 9:11 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్లను, పరిశీలించిన జిల్లా కలెక్టర్..

సిద్దిపేట మర్కుక్, జూన్ 13, ప్రజావాణి

మర్కుక్ మండల కేంద్రంలోగల పోలిస్ గృహ సముదాయాలలో ఈ అకడమిక్ సంవత్సరం లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను నియోజకవర్గ వారీగా ఒక్కో స్కూలు మంజూరు చేయడం జరిగిందని గజ్వేల్ నియోజకవర్గం సంబంధించి మర్కుక్ మండల కేంద్రంలోని పోలీస్ గృహ సముదాయంలో తాత్కాలికంగా ఈ అకాడమిక్ ఇయర్ లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ లో ప్రారంభించి 1వ తరగతి నుండి 8 తరగతి వరకు అడ్మిషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుందని తరగతి గదులు ఇతరత్రా ఆఫీస్ అన్ని పనులు దాదాపు పూర్తి చేస్తున్నామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తరగతి గదుల ఏర్పాటులో ఫర్నిచర్, కరెంట్ కనెక్షన్, వంట గది, మరుగుదొడ్ల ఏర్పాటు నాణ్యత ప్రమాణాలతో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా సకాలంలో పూర్తి చెయ్యాలని ఈడబ్ల్యూఐడిసి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట డీఈవో వరగంటి శాస్త్రి, ఈడబ్ల్యూఐడిసి ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి, సెక్టోరల్ అధికారి రామస్వామి తదితరులు ఉన్నారు.