తెలంగాణ ఆవిర్భావానికి 12 ఏళ్లు.. ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా?: సీపీఐ

ఘట్‌కేసర్, జూన్ 2 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘట్‌కేసర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ కేఎల్ మహేంద్రానగర్ కాలనీలో సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ నాయకుడు కామ్రేడ్ ఎల్లయ్య జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరి జైచంద్ర మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 వసంతాలు పూర్తయినా ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదన్నారు. రాష్ట్ర ఏర్పాటు తమ వల్లే జరిగిందని చెప్పుకున్న అప్పటి టీఆర్‌ఎస్, నేటి బీఆర్‌ఎస్...