తెలంగాణ ఆంధ్ర ప్రధాన రహదారిపై చీకట్లు కల్లూరు మున్సిపాలిటీ నిర్లక్ష్యమా

కల్లూరు మున్సిపాలిటీలో వెలగని వీధి దీపాలుప్రజా ప్రభుత్వమా..? "సంక్షేమ" రాజ్యమా..? అని ప్రశ్నిస్తున్న ప్రజలుకల్లూరు, మే 30: తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని అనేక ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో చీకటి అలుముకోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రధాన రహదారిపై రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, వీధి దీపాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు....