prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 3:03 pm Digital Edition : RAJASHEKARREDDY

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం- బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి

 

బెజ్జంకి, జూన్ 2(ప్రజావాణి)

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పోలీస్ స్టేషన్‌లో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ
తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి ఆశయాలను సాకారం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర సాధనలో విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు అందించిన సహకారం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని,అమరుల త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో మరింత అంకితభావంతో పనిచేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బెజ్జంకి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.