prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 2:31 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

తృటిలో తప్పిన పెను ప్రమాదం ఇబ్రహీంపట్నం రింగులో ద్విచక్ర వాహనదారులకు ప్రమాదకర పరిస్థితూ లు.

ప్రజావాణిన్యూస్(మార్చి23)ఎన్టీఆర్ జిల్లా.ఇబ్రహీంపట్నం రింగ్ లో ఇసుక రోడ్డు మీద ఉండటంతో ద్విచక్ర వాహనలు స్కిడ్డై తృట్టి లో ప్రమాదం తప్పింది,ఓవర్ లోడ్లతో భారీగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలపై నామం మాత్రం మే ట్రాఫిక్ వారు ఫైన్ వేయడంతో విచ్చలవిడిగా అధిక లోడుతో రవాణా చేస్తున్నారు.ఇసుక, కంకర, డస్టు, బూడిద, అధికంగా వాహనానికి పరిమితికి మించి రవాణా చేస్తూ రోడ్లపై ఏదైనా అడ్దోస్తే సడన్ గా బ్రేక్ వేయడంతో వాళ్ల వాహనంపై ఉన్న మెటీరియల్ రోడ్లపై పడి దాని మీదకు రాగానే ద్విచక్ర వాహనదారులు స్లిప్ఐ ప్రమాదాలకు గురవుతున్నారు.తక్షణమే సంబంధిత రవాణాశాఖ అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది, నేషనల్ హైవే సిబ్బంది, అలాంటి వాహనాలపై చర్యలు తీసుకోవాలని ద్విచక్ర వాహనదారులు అధికారులను కోరుతున్నారు.