తుర్కపల్లి నూతన ఎస్‌హెచ్‌ఓ శివకృష్ణను కలిసిన భాస్కర్ గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)గా బాధ్యతలు స్వీకరించిన శివకృష్ణను భాస్కర్ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ గౌడ్ నర్సింగ్ రావు పాల్గొన్నారు.