prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 5:10 am Digital Edition : GIRIBABU KONDHURG

తుమ్మలపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

తుమ్మలపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

 

ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభం

 

గ్రామీణాభివృద్ధికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషి అభినందనీయం

 

జిల్లేడు చౌదరిగుడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖర్

 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధులతో జిల్లేడు చౌదరిగూడెం మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక చొరవతో గ్రామంలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే ఈ పనులు పూర్తయితే ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి సర్పంచ్ సనా సలీం అర్షద్, డిప్యూటీ సర్పంచ్ పిట్ట చంద్రశేఖర్, తాలూకా మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎంపీటీసీ రజిత వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటనరసింహారెడ్డి, కిసాన్ సెల్ నాయకులు, ఎల్కగూడెం సర్పంచ్ బంధయ్య, లచ్చంపేట్ సర్పంచ్ సునీత రాములు, మాజీ సర్పంచ్‌లు నర్సింహులు, సలీం, యాదయ్య, నవీన్ గౌడ్, బంగారు అంజయ్య, ఆజాం పటేల్, రసూల్, యేసయ్య, అభిషేక్, రాజు, సాయన్న, డానియల్, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు..