తుమ్మగూడెం బిఆర్ఎస్ నాయకుడు పై సస్పెండ్ వేటు…! !!పార్టీని బలహీనపరిచే కార్యక్రమాలే కారణం..! !!పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన ప్రతి వారిపై ఇవే చర్యలు ఉంటాయి భవిష్యత్తులో..!!
ప్రజావాణి ,మోతె, మే 13:మండల పరిధిలోని తుమ్మగూడెం గ్రామపంచాయతీలో బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విరండి పాపా చారి అనే గ్రామ నాయకుడు పై సస్పెండ్ వేటు పడింది. పార్టీ సిద్ధాంతాలకు పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని భారతీయ రాష్ట్ర సమితి గ్రామ శాఖ కార్యవర్గం గ్రామ శాఖ అధ్యక్షులు కుక్క బిక్షం గౌడ్. బుధవారం తుమ్మగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్...