prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 2:54 pm Digital Edition : NARAYANA ASIFABAD

తుకుడోజీ మహారాజ్ సమ్మేళనంలో పాల్గొన్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

తుకుడోజీ మహారాజ్ సమ్మేళనంలో పాల్గొన్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

కొమ్మురం బీం ఆసిఫాబాద్ జిల్లా ​కేరమేరి మండలం గొయగాం గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన రాష్ట్రసంత్ తుకుడోజీ మహారాజ్ అంతరాష్ట్ర సమ్మేళన కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు.
తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఈ ప్రాంతమంతా భక్తిభావంతో పులకించిపోయింది. తుకుడోజీ మహారాజ్ అందించిన సామాజిక ఐక్యత సందేశం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్న ఎమ్మెల్యే భక్తులతో కలిసి కార్యక్రమంలో మమేకమయ్యారు. విభిన్న రాష్ట్రాల ప్రజల కలయికతో ఈ సమ్మేళనం మతసామరస్యానికి భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచింది.ఎమ్మెల్యే తో కేరమేరి వైస్ ఎంపీపీ కలాం గారు పాల్గొన్నారు.