prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 5:19 am Digital Edition : VENU THIRUMALAYAPALEM

తిరుమలాయపాలెంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

జెండా ఆవిష్కరించిన కొండబాల కరుణాకర్

తిరుమలాయపాలెం,ప్రజావాణి:

తిరుమలాయపాలెం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా నాయకులు కొండబాల కరుణాకర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ, తారక రామారావు పేద, బడుగు, బలహీన వర్గాలు మరియు మహిళలకు రాజకీయ అధికారాన్ని అందించిన మహానేత అని కొనియాడారు.రైతులు, పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో ప్రజాకర్షణ పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప దూరదృష్టి నాయకుడిగా ఆయనను స్మరించుకున్నారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొప్పుల వెంకట్రావు, వార్డు సభ్యులు మల్లీడి భాగ్యమ్మ, ఉప్పల వెంకటేశ్వర్లు, తెలుగు యువత నాయకులు మల్లెంపాటి లహరిన్, యడ్లపల్లి కార్తీక్, బొల్లికొండ హనుమంతు, గ్రామశాఖ అధ్యక్షులు మల్లీడి నాగేశ్వరరావు, మల్లీడి రమేష్, ఆలేటి రంగయ్య, రమావత్ శ్రీనివాస్, మద్దినేని హరినాద్, మద్దినేని కోటేశ్వరరావు, కేతినేని నరేష్, ఆళ్ల నరసింహరావు, మల్లీడి బాబురావు, ధనియాకుల లక్ష్మినారాయణ, బొడ్డుపల్లి రాము, జల్లా రామారావు, నడ్డి ఉపేందర్, వడ్డూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.