తిరుమలాపూర్‌లో ఘనంగా వనభోజనాల పండుగ
తిరుమలాపూర్‌లో ఘనంగా వనభోజనాల పండుగ పోతంగల్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో ఆదివారం వనభోజనాల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. కట్ట మైసమ్మకు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని దేవిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బోయి సాయిలు, గైనీ గంగారం, జైరాం, గంగాధర్, బరిగే గోపాల్, కాలే సాయికృష్ణ, రాము, నగేష్, యాదు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.