తిరుమలపూర్‌లో భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా బోనాల సంబరాలు
తిరుమలపూర్‌లో భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా బోనాల సంబరాల కోటగిరి, జూలై 31: కోటగిరి మండలం తిరుమలపూర్ గ్రామంలో శుక్రవారం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకుని ఆటపాటలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం చిన్నారులు, మహిళలు ప్రధాన వీధుల గుండా నృత్యాలు చేస్తూ బోనాల ఊరేగింపును నిర్వహించగా గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోయి సైదవ్వ, వార్డు సభ్యులు కాలే లక్ష్మీబాయి, రమాబాయి, గ్రామస్తులు కాలే...