తిరుపతి లో పోలీస్ సిబ్బందికి మెగా ఐ మెడికల్ క్యాంప్ నిర్వహణ.
ప్రజావాణిన్యూస్(మార్చి14)తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో అగర్వాల్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఐ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ వైద్య శిబిరాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు, ఐపిఎస్.గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ,పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించడం చాలా ఆనందదాయకమని తెలిపారు.పోలీస్ శాఖలో విధులు నిర్వహించే సిబ్బంది రోజువారీగా బిజీగా ఉండటంతో ఆరోగ్యపరమైన విషయాలకు సరైన సమయం కేటాయించలేని...