prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 9:47 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

తిరుపతి జిల్లా నాయుడుపేట పౌరసరఫరాల శాఖ గోదాములో జరుగుతున్న అవకతవకలపై పట్టించుకోని ఉన్నతాధికారులు.

తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) నాయుడుపేట పౌరసరఫరాల శాఖ గోదాములో జరుగుతున్న అవకతవకలపై పట్టించుకోని ఉన్నతాధికారులు.అధికారుల అవతారమెత్తి ఆపరేటర్ చక్రం తిప్పుతున్నా అవినీతి ఊబిలో కూరుకుపోయిన అధికారులు ఆపరేటర్ వైఖరికి సై అంటున్న వైనం.రేషన్ మాఫియాకు ఇటు ప్రత్యక్షంగానూ అటు పరోక్షంగాను ఆపరేటర్ సహకరిస్తూ ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తున్న ప్రజానీకం. పెళ్ళకూరు, నాయుడుపేట, ఓజిలి మండలాలకు చెందిన రేషన్ దుకాణాలకు మోతాదు కంటే తక్కువ బియ్యాన్ని సరఫరా చేస్తూ అక్రమ వ్యాపారానికి ఆపరేటర్ తెరలేపారనే చర్చ జోరుగా సాగుతున్న వైనం.ఉన్నతాధికారులకు నెలసరి మామూళ్ళు ఆపరేటర్ అందిస్తుండడంతో అక్రమ రేషన్ వ్యాపారానికి ఇటు ప్రత్యక్షంగానూ అటు పరోక్షంగాను ఉన్నతాధికారులే సహకరిస్తున్నారని విమర్శిస్తున్న ప్రజలు.రేషన్ అక్రమ వ్యాపారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోమని హెచ్చరిస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకుండా ప్రభుత్వ సూచనలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శిస్తున్న ప్రజలు. జిల్లా కలెక్టర్ నాయుడుపేట పౌరసరఫరాల శాఖ గోదాములో జరుగుతున్న అవకతవకలపై శాఖాపరమైన విచారణ చేపట్టి అవకతవకలకు పాల్పడుతున్న ఆపరేటర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్న ఇటు రేషన్ డీలర్లు అటు ప్రజలు.