prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 9:58 am Digital Edition : RAJASHEKARREDDY

తిమ్మాయిపల్లిలో ఘనంగా బిఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

బెజ్జంకి,ఏప్రిల్ 27(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తిమ్మాయపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ బిఆర్ఎస్ నాయకులతో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు దానబోయిన పోచయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడానికి కారణమైన కేసీఆర్ కు ప్రజలందరూ ఎంత రుణపడి ఉన్నారని,రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారం నుండి అనేక కార్యక్రమాలను రూపొందించారని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, సమయానికి రైతు బంధు, వంటి కార్యక్రమాలు రూపొందించిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు.ఈ కార్యక్రమంలో దానవేణి పోశయ్య, ప్రదీప్, కల్లూరి రామ్మోహన్, కల్లూరి రమేష్, కల్లూరు నరేందర్, కవ్వశ్రీను, చాడగొండ శ్రీనివాస్, దానవేని స్వామి,మల్లేష్, రవి, రాజిరెడ్డి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.