బెజ్జంకి, జూన్ 21(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తిమ్మయపల్లి గ్రామంలో ముదిరాజ్ కుల సంఘం ఆరాధ్య దేవత అయిన పెద్దమ్మ తల్లి ఆలయంలో కడప ఏర్పాటు కార్యక్రమాన్ని గ్రామ పురోహితుల చేతుల మీదుగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దానబోయిన సత్తవ్వ–పోచయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధికి గ్రామ ప్రజలు, ముదిరాజ్ కుల సంఘం సభ్యులు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ పాలక వర్గం,ముదిరాజ్ కుల సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.