prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 1:12 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

తిమ్మాయపల్లిలో ఘనంగా పోచమ్మ తల్లీ బోనాలు..

తిమ్మాయపల్లిలో ఘనంగా పోచమ్మ తల్లీ బోనాలు

సిద్దిపేట జిల్లా, మార్చి 22, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తిమ్మాయపల్లి గ్రామంలో గ్రామ ప్రజలందరూ అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లీ బోనాలు ఘనంగా నిర్వహించారు.గ్రామంలో వీధి విది గుండా ప్రతి ఒక్క ఇంటి నుండి మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని, శవసత్తుల పూనకాలు, పోతారాజుల విన్యాసాలతో పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు.అనంతరం గ్రామదేవత అయినటువంటి మహిళలు భక్తి శ్రద్దలతో పోచమ్మ తల్లికి మొక్కులుసమర్పించుకొని,మహిళలు గ్రామ ప్రజలు మాట్లాడుతూ ప్రజలందరూ అయూ ఆరోగ్యాలతో,సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని,కాలనుగునంగా వర్షాలు సమృద్ధిగా కురవాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దానబోయిన సత్తవ్వ -పోచయ్య, ఉపసర్పంచ్ శానగొండ పుషవ్వ, వార్డు సభ్యులు,గ్రామ ప్రజలు, మహిళలలు తదితరులు పాల్గొన్నారు..