తాళ్లపల్లిలో భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాల ఉత్సవాలు

తాళ్లపల్లిలో భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాల ఉత్సవాలువిశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో ఘన నిర్వహణ – మహిళల బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలుఇల్లంతకుంట, ప్రజావాణి:ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలో విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల ఉత్సవాలను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పించి పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా డప్పు చప్పుళ్ల నడుమ భక్తులు ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో...