తాతయ్యగుంట గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాల సమర్పణ ఘనంగా నిర్వహించిన తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్
తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (మే09) తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం భక్తిశ్రద్ధలతో,మేళతాళాల నడుమ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక కోలాహలంతో తుడా ఆఫీస్ నుండి తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయం వరకు ఘనంగా పాదయాత్ర నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఆంధ్రప్రదేశ్ CPS ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మరియు తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ తెలిపారు.ప్రతి సంవత్సరం ఉద్యోగుల...