prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 8:43 am Digital Edition : PRAJA VANI

తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి* 

*తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి*

 

 

కడప నగరంలోని ప్రకాష్ నగర్ లో తాగునీరు సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమస్యను పరిష్కరించాలని మంగళవారం ప్రకాష్ నగర్ లోని సాంఘిక సంక్షేమ హాస్టల్ నందు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాల సుమంత్ అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం పది రోజులుగా ఆరో ప్లాంట్ చెడిపోయి విద్యార్థులు త్రాగునీరు కి తీవ్ర ఇబ్బందులు పడుతూ మరియు స్నానానికి గాని, విద్యార్థులు బట్టలు ఉతుక్కోవడానికి చాలా అవస్థలు పడుతున్నారని ఈ విషయం పైన వార్డెన్ గారికి అనేకమార్లు చెప్పినా కూడా పట్టించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా హాస్టల్లో 350 మంది విద్యార్థులు గాను ఈ నీటి సమస్యతో పాటు మెనూ కూడా సక్రమంగా పాటించట్లేదని ఇష్టం వచ్చినట్టుగా ఉండడం ఏమన్నా ప్రశ్నిస్తే విద్యార్థుల పైన మండిపడటం జరుగుతుందన్నారు . ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇలాంటి నీటి సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే జిల్లా అధికారులు స్పందించి, నీటి సౌరకర్యం కల్పించాలని, అలాగే మెనూ ప్రకారం పాటించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు అఖిలేష్, కార్తీక్, మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు సాగర్,విక్రమ్ చందన్,గిరి వర్ధన్,మహేష్,హరిబాబు, సిద్దు,రాజేష్, ఓంకార్,రాజు హేమంత్ తదితరులు పాల్గొన్నారు.