prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 7:07 am Digital Edition : VIJAYKUMAR SIDDIPET

తహసిల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత జిల్లా అధికారులకు శిక్షణ..జిల్లా కలెక్టర్ కె. హైమావతి పాల్గొని దిశా నిర్దేశం చేశారు..

సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో సెన్సెస్ – 2027 ప్రక్రియ గూర్చి తహసిల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత జిల్లా అధికారులకు శిక్షణ తరగతులలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి పాల్గొని దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…సెన్సెస్  ” అంటే తెలుగులో జనాభా గణన, జనగణన, లేదా జనాభా లెక్కలు అని అర్థం. ఇది ఒక దేశం లేదా ప్రాంతంలోని ప్రజల సంఖ్య, వారి వయస్సు, లింగం, విద్య, ఆర్థిక స్థితి వంటి వివరాలను ఒక క్రమపద్ధతిలో సేకరించి, నమోదు చేసే అధికారిక ప్రక్రియ. ఒక నిర్దిష్ట సమయంలో, ఒక నిర్దిష్ట ప్రాంతంలోని ప్రతి వ్యక్తి గురించి సమాచారాన్ని సేకరించడం. ప్రభుత్వ ప్రణాళికలు, విధాన నిర్ణయాలు, మరియు నిధుల కేటాయింపు కోసం ఈ డేటా చాలా కీలకం.భారతదేశంలో సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు చేశారు కానీ 2021 లో కరోనా వైరస్ వల్ల చేయలేదు. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి జనాభా గణన చేయడం ఇది 8 వది. సెన్సెస్ – 2027 గణన ఫేస్- 1 లో గృహాల జాబితా ఫేస్- 2 లో జనాభా జాబితాను సేకరిస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని ఒక సిస్టమెంటిక్ గా జరుగుతుంది. జిల్లాలోని తహసిల్దార్, ఏంపిడిఓ అధికారులకు మొదటగా గృహ గణన గూర్చ శిక్షణ అందిస్తారు. ఈ గణనలో ఎమ్యునరేటర్, సూపర్ వైజర్, ఛార్జీ ఆఫీసర్ లు జరుపుతారు.క్రితం జరిపిన సెన్సెస్ కి ఇప్పుడు జరిగే సెన్సెస్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ లో డిజిటర్ విధానం జరౌతుందని మొబైల్ యాప్ లో సైతం అప్లోడ్ చేస్తారు.మే నెలలో ఈ ప్రక్రియ ఇండ్ల గణన తహశీల్దార్లు, ఎంపిడిఓ లు 3 రోజుల శిక్షణ క్లుప్తంగా నేర్చుకోవాలని నియమావళి ప్రకారం ప్రక్రియ జరపాలని తెలిపారు. ప్రతి లిస్ట్ రోజు డేటా ఎప్పటికప్పుడు తెలుస్తుంది.అందరూ అధికారులు గణనలో పాల్గొని విజయవంతంగా పూర్తి చెయ్యాలనీ ఈ సెన్సెస్ – 2027 జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని తెలిపారు.-2025 లో సర్టిఫికెట్ మంజూరులో ఒకటికి రెండుసార్లు చెక్ చేశాకే మంజూరు చెయ్యాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, సిపిఓ దశరథ్, డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అసిస్టెంట్ సెన్సెస్ అధికారి రమాదేవి, ఉష తదితరులు పాల్గొన్నారు.